మేలుకొలుపు
ఎక్కడున్నావ్ నువ్వు ఓ భారతీయుడా !
ఎక్కడుంది సంక్షేమమనే స్వర్గం
ఎక్కడ చూసినా అరాచకమే
ఎక్కడ చూసినా అవినీతే
ఎక్కడ చూసినా ఆక్రందనలే
ఎక్కడ చూసినా ఆర్తనాదాలే
ఎక్కడ చూసినా ఆక్రోశాలే
ఎక్కడ చూసినా ఆత్యాచారాలే
ఎక్కడ చూసినా అసమర్థతే
ఎక్కడ చూసినా సంక్షోభమే
ఇన్ని జరుగుతున్నా అందరూ గగ్గోలెత్తి అరుస్తున్నా ఆ అరుపులన్నీ అరణ్య రోదనలే అని అనుకొంటూ ఆరోహణ క్రమంలో నా వంతు ఇంకా రాలేదు అవరోహణ క్రమంలో నేనసలు లేను అని సిగ్గు పడే విధంగా ఆలోచించుకొంటున్నావా ...
లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం అని సమాధానమిస్తున్నావా ...
అసలు ఎక్కడున్నాం నువ్వు నేను ...
పరాయి పాలనలో మ్రొగ్గుతున్న దేశం కోసం తృణప్రాయంగా త్యాగం చేసావ్ ఎందరికో దేశ భక్తిని ప్రజ్వలింపజేసావు ...
వారిని నీ బాట లోకి ఆహ్వానించి పారతంత్య్రాని పారద్రోలావు
కానీ నేడు ఎందులకు సాటి భారతీయుడే అజ్ణాన అంధకారములలో పడి మునిగి తేలుతుంటే జ్ఞాన జ్యోతిని వెలిగింప ముందుకు రావు
నిజమైన స్వాతంత్రపు స్వేచ్ఛను అందరూ ఆస్వాదించేలా చేసేందుకు మొదటి అడుగుకూడా వెయ్యలేక పోతున్నావు
ఎక్కడున్నాయి నాటి పాడి పంటలు
ఎక్కడున్నాయి నాటి సిరి సంపదలు
ఎక్కడున్నాయి నాటి సుఖ శాంతులు
ఎక్కడున్నాయి నాటి పసి పాపల బోసి నవ్వులు
ఎక్కడున్నాయి నాటి మహిళా లోకపు ఆత్మ విశ్వాసపు చిరుదరహాసాలు
ఎక్కడున్నాయి నాటి వృద్ధ లోకపు మేధస్సుకు కు గుర్తింపులు చేయూతలు
ఎక్కడున్నాయి నాటి యువతీ యువకుల ఆరోగ్యకర అనుబంధాలు
ఎక్కడున్నాయి నాటి కుల మత లింగ రహిత విద్యా ఉద్యోగ విధానాలు
ఎక్కడున్నాయి నిజమైన ఔత్సాహిక శాస్త్రవేత్తలకు అవార్డులు రివార్డులు
ఎక్కడున్నాయి నాటి రైతుల రమణీయ జీవితాల రంగులు
ఎక్కడున్నాయి నాటి బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల అభివృద్ధి ఆశయాలు
ఎక్కడున్నాయి నాటి నిస్వార్ధ నిరాడంబర నిరుపమానమైన రాజకీయ సిద్ధాంతాలు
ఇవన్నీ ఇంతకు ముందు సాధ్యం అయినా ..
ఇపుడు ఓ సాధ్యం కానీ మధుర స్వప్నం అని నిట్టూర్చవలసిందేనా
ఎక్కడున్నావ్ నువ్వు ఓ భారతీయుడా ?
స్వప్నముల లోనే సుఖ నిద్ర కోసం పరితపిస్తూ సమర్ధించుకొంటున్నావా
ఇదంతా అందని ద్రాక్షాయే అని నిన్ను నీవు అనునయించు కొంటున్నావా
ఏమైపోయావు ...
మత మారణ హోమములు
మత్తు మందుల మోహాలు
మాఫియా నీలి నీడలా మజిలీలు
మానభంగముల మంటలు
ఇదేనా మన కోరుకొన్న మరో ప్రపంచం
మానవత్వమే ఓ మాయని, తీరని మచ్చ అని మాటలుడిగి, చేష్టలుడిగి చూస్తూ ఉందామా ...
చెప్పు ఓ భారతీయుడా ?
ఆరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని డెబ్భైవ వసంతంలోకి సమీపిస్తున్నా
నేటికి అవే ఆకలి మంటల బాధలు
దోపిడీ దౌర్జన్యాలు
కుళ్ళు కుతంత్రాలు
కుల మతాల అడ్డుగోడలు
స్వార్ధ రాజకీయాలు లింగ విబేధాలు
ఆర్థిక అసమానతలు
మరి ఎన్నో తారతమ్యాలు
లెక్కింపలేని కుంభకోణాలు
సరిదిద్దలేని సంక్షోభాలు
ఏది నాటి నీతి, నిజాయతీ ... మచ్చు కైనా కాన రావట్లేదే
అఖండ భారతావని ఆ సేతు హిమాచలం నుండి కన్యాకుమారి వరకు అల్లర్లతో అట్టుడికి పోతుంటే
ఓ భారతీయుడా మన వంతుగా మనం ఇంతకు ముందు వాళ్ళు చేసిన అభివృద్ధిని వేన్నోళ్ల కీర్తిస్తూ
నేటి నాయకుల, ప్రభుత్వ ప్రతినిధుల అసమర్ధతను వాడి వేడి విమర్శలతో ప్రశ్నిస్తే సరిపోతుందా , మన సమస్య సమసిపోతుందా ... నేటి భారతం అభివృద్ధి భారతంగా బావుటా ఎగురవేస్తుందా ...
స్పందిస్తేనే సమస్యలు సమసి పోతాయంటే పరిష్కారాల కోసం ప్రయతించ నవసరంలేదు
సమాజం కోసం, వ్యవస్థ కోసం మనం ఏమి చేస్తున్నాం ...
క్రొవొత్తులతోను, నల్ల బాడ్జి లతోను, హోర్డింగ్లతోను, అర్ధ నగ్న వీపుల పైన వినూత్న రీతిలో మన స్పందనలను ప్రదర్శిస్తూ ఆందోళనలను తెలిపితి సరిపోతుందా ...
ఇటువంటి ఆందోళనలు పురోభివృద్ధితో దేశాన్ని ప్రపంచ శక్తిగా మారేటట్లు చేస్తాయా
మన ఎదురుగా అనాయ్యలకు స్పందిస్తే సరిపోతుందా వాటిని ఎదుర్కొనే దైర్యం చేయలేమా ...
మరో
నేటి గాంధీజీ
నేటి నేతాజీ
నేటి భగత్
నేటి అంబేత్కర్
ఎవరో ఒక మహా నాయకుడు
... ఇలా నాయకుల ఆగమనం కోసం వేచి చూడాల్సిందేనా ...
విమర్శలతో ప్రభుత్వానిదే బాధ్యత అంటూ , చేతులు దులుపుకొంటూ మనం బాధ్యత గల పౌరులుగా వ్యవహరిస్తున్నామా ఆలోచించండి ...
ఎక్కడికి పోతుంది ఈ దేశం పురోగమనానికా లేక తిరోగమనానికా ...
కరెంటు కరవుతో ఉన్నా కరెంటు అఫైర్స్ ని కవర్ చేసుకొంటూ కామెంట్ చేసే కార్యక్రమం పెట్టుకొంటే కాల యాపన తప్పితే ఏమి జరుగుతుంది ...
అత్యాచారాలతో నిండిన అఖండ భారతావనిఅరా చేతిలోని పేపర్ ని అర గంటలో చదివి పూర్తి చేసి ఆరు గంటలు అరుగుల మీద మీటింగ్స్ పెడితే ఉపయోగమేముంటుంది ... ఫ్లాష్ మాబ్ చేస్తూ అందర్ని మార్చుతున్నామన్న మాయలో ఉండడం కంటే దాని కోసం మనం జీన్స్,
టీ షర్ట్ లతో, గగ్నమ్ స్టైల్స్ తో , వినూత్న నాట్య రీతులతో ఫాషన్ పెరేడ్ చేస్తున్నామని మర్చిపోతే ఎలా ...
మార్పు రావాల్సింది ప్రభుత్వంలో కాదు మనలో నీలో నాలో
సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకొనటం, నడిపించడం, విమర్శిస్తూ దిశా నిర్దేశం చేయవలసింది నీవే అని గుర్తు చేస్తూ సమాజం కోసం నీ కోసం కొంచెం సమయం ఇచ్చే వ్యక్తి అని నమ్ముతూ మారుతావని ఆశిస్తూ
మరో భారతీయుడు