Sunday, April 9, 2017

స్నేహం - FRIENDSHIP SERIES

"స్నేహమా"
ఏమని చెప్పను ...
విస్తరించిన వెల కట్టలేని వెన్నెల "స్నేహం"
మలినం లేని మృదువైన మౌనం "స్నేహం"
బంధుత్వం అవసరం లేని బలమైన బంధం "స్నేహం"
మమతలతో మైమరపించే మహా మాయ "స్నేహం"
ఆప్యాయతలతో అలరించే అనుబందం "స్నేహం"
వివరణలు అడగని విలువైన వాస్తవం "స్నేహం"
నిరూపణలు కోరని స్వచమైన నిజం "స్నేహం"
సరిగమలు అక్కర లేని వినసొంపైన సంగీతం "స్నేహం"
ప్రేమానురాగాలకు నిజమైన ప్రతిరూపం "స్నేహం "
కరుణ ,సహృదయతలకు కావ్య రూపం "స్నేహం"
కొందరికే సొంతం అపురూప వరం స్నేహం ...
"వాళ్ళే" మన నిజమైన "శ్రేయోభిలాషి"
దేవుడు నాకు చాలా చాలా మంచి మిత్రులను ఇచ్చాడు ...
కొన్ని బాధలను వైద్యులు కూడా గుర్తించలేదు కానీ స్నేహితులు గుర్తిస్తారు ...
దేవుడు కూడా మాన్పలేని గాయాల నెన్నింటినో స్నేహం మాన్పుతుంది ...
అందుకే చిరు కవిత అలాంటి నా ప్రియ మిత్రులకు అంకితం ...

స్నేహం పై నా అభి ప్రాయం నా మాటల్లో నా చిన్న సొంత కవితలో

ఉదయ రాగం - LOVE AND AFFECTION SERIES

నా కనులపై మొగ్గ తొడిగే " ఉదయం " నీవే నని నీకెలా విన్నవించేది
నా పెదవులు పలికే మధురమైన "మాట " నీ పేరని నీకెలా వివరించను
నా మనసు ఆలాపించే తీయని " పాట" నీ కోసమే అని ఎలా చెప్పను
నా కై పుట్టిన అరవిరిసిన అందం నీవని నీకెలా వివరించేది
నా జీవితం లోని అంధకారంని వెలుగుతో నింపడానికే నాకై జన్మించిన "జాబిలి" నీవని నీకెలా బోధపరిచేది
నా హృదయ మృదు మనోహర మోహన "రాగం" నీవేనని నీకెట్లా విన్నవించుకొనేది
నా శ్వాస అణువణువు నీ సాన్నిహిత్యం అనే సువాసనను స్మరిస్తోందని నీకెలా వివరించేదే

కానీ అన్ని ఉన్నా ఏదో లేని వెలితి నన్ను కృంగదిస్తోంది
వెలితి నీవేనని నీకెలా తెలియచేసేది

అన్ని ఉన్నా ఆనందంగా ఉండ లేక నిన్ను పొందాలి అన్న ఆకలి అనే ఆరాటంతో అలమటిస్తున్నాను.
ఆసాంతం సొంతం చేసుకోవాలని సతమతవుతూ లెక్కకు మించిన సందేహాలతో స్వార్ధపరునిగా మారుతున్నాను ...
ఇట్లు సదా నీ స్మరణలో సాగిపోతూ
నీ సేవకై అంకితమైన
నువ్వు అవునన్నా కాదన్నా 
నీ  శ్రేయోభిలాషి
"
శ్రీ "